యెమెన్ లో కేరళ నర్సుకు జులై 16న ఉరిశిక్ష
- July 09, 2025
యెమెన్: యెమెన్ లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళ నర్సు-నిమిష ప్రియకు పడిన మరణశిక్షను ఈనెల 16న అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే యెమెన్ దేశాధ్యక్షుడు రషాద్ అల్ అలిమి ఇందుకు ఆమోదం తెలపగా 16న ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన విషయాన్ని కేరళలోని నిమిష కుటుంబీకులకు యెమెన్ జైలు అధికారులు తెలియజేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ఉరిశిక్షను ఆపేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
యెమెన్ రాజధాని సనాలోని జైల్లో ఉన్నారు
ఈ కేసును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని స్థానిక అధికారులు, నిమిష కుటుంబ సభ్యులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్పాయి. అయితే, ప్రస్తుతం 38 ఏళ్ల నిమిష హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న యెమెన్ రాజధాని సనాలోని జైల్లో ఉన్నారు. అటు భారత పక్షానికి హౌతీ తిరుగుబాటుదారులతో అధికారిక సంబంధాలు లేనందున చర్చలు కష్టతరంగా మారాయి. అటు మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ దియా చెల్లించి క్షమాభిక్ష పొందేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రియా తల్లి ప్రేమకుమారి ఆమెను విడుదల చేసే ప్రయత్నాలలో భాగంగా గతేడాది యెమెన్‌కు వెళ్లారు.
కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష నర్సు
కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. 2011లో థామస్‌ను వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్ తెరవాలనుకొన్నారు.ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష, థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొన్నారు.అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త, కుమార్తె కేరళకు వచ్చేశారు.నిమిష యెమెన్‌లోనే ఉంటూ సెంటర్‌ను కొనసాగించారు.
చివరి నిమిషంలో కూడా ఆమె క్షమాభిక్ష కోసం చర్చలు
ఈ సమయంలో మెహది ప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురిచేస్తూ ఆమె పాస్‌పోర్టు లాక్కొన్నాడు.అతడి పై 2016లో ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోయేసరికి, 2017లో మెహదికి మత్తు మందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది.మోతాదు ఎక్కువవడంతో అతడు చనిపోయాడు.ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పడేసింది. అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను అరెస్టు చేశారు.ఈ కేసులో ఆమెకు మరణశిక్ష పడింది.చివరి నిమిషంలో కూడా ఆమె క్షమాభిక్ష కోసం చర్చలు జరుగుతున్నాయి.
2018లో మహదీ హత్య కేసులో నిమిషను దోషిగా కోర్టు నిర్ధారించింది.గత ఏడాది డిసెంబర్ 30న, యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి 2017 నుండి జైలులో ఉన్న నిమిషా ప్రియకు మరణశిక్షను ఆమోదించారు.కాగా బాధితురాలి కుటుంబానికి పరిహారంగా చర్చల బృందం ఒక మిలియన్ USD అందించనున్నట్లు సమాచారం. .
నిమిషా ప్రియ చేసిన నేరం ఏమిటి?
జాన్ బ్రిట్టాస్.(ఎ నుండి డి వరకు) యెమెన్ జాతీయుడిని హత్య చేసిన నేరం పై సనాలోని యెమెన్ సుప్రీంకోర్టు భారతీయ నర్సు నిమిషా ప్రియకు మరణశిక్ష విధించింది.కేసుకు సంబంధించి పౌర సమాజం నుండి సహా ప్రభుత్వం కొన్ని ప్రాతినిధ్యాలను అందుకుంది.
నిమిషా ప్రియ ఎంత బ్లడ్ మనీని పొందింది?
పాలక్కాడ్‌లోని కొల్లంగోడ్‌కు చెందిన నిమిషా ప్రియ, యెమెన్ పౌరుడు తలాల్ అబ్దుల్ మహదీ హత్య కేసులో 2017 నుండి సనాలో జైలు శిక్ష అనుభవిస్తోంది. దియా (రక్త డబ్బు)గా చెల్లించిన $40,000లో ఏ భాగాన్ని కూడా పొందలేదని తలాల్ కుటుంబం చెబుతోందని సుభాష్ చంద్రన్ అన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!