డొమెస్టిక్ హెల్పర్ ఫీజుల తగ్గింపు.. బహ్రెయిన్ కేబినెట్ ఆందోళన..!!
- July 09, 2025
మనామా: డొమెస్టిక్ హెల్పర్లను తీసుకురావడానికి రుసుమును పరిమితం చేసే ప్రణాళికల కాణంగా ఎదురుదెబ్బ తగలవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. ఇది బహ్రెయిన్ రిక్రూట్‌మెంట్ కార్యాలయాల మధ్య పోటీని మందగిస్తుందని, ప్రతి ఏజెన్సీ ఒకే మొత్తాన్ని వసూలు చేయవలసి వస్తే, చాలా మంది రిక్రూట్‌మెంట్‌కు తక్కువ ఖర్చుతో కూడుకున్న దేశాల నుండి వచ్చే కార్మికులపై మాత్రమే దృష్టి సారిస్తారని షురా కౌన్సిల్‌కు పంపిన ఒక పత్రంలో కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది.
దేశీయ సిబ్బందితో సహా విదేశీ కార్మికుల నియామక ప్రక్రియ ప్రతి దశను రికార్డ్ చేయడానికి ఒక వెబ్ పోర్టల్ తీసుకొస్తున్నట్లు తెలిపింది. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ఏజెన్సీ ఫీజులలో అకస్మాత్తుగా పెరుగుదలను కారణాన్ని వివరించమని సంబంధిత సంస్థకు నోటీసులు జారీ చేస్తుందని, అనంతరం ఆ సంస్థపై తగిన చర్య తీసుకోవాలని కేబినెట్ సూచించింది. ఏజెన్సీలను క్రమం తప్పకుండా ఆడిట్ చేయాలని అథారిటీ భావిస్తోంది. ఈ సందర్భంగా నియామక ఖర్చులను తగ్గించి, డైరెక్ట్ నియామకాన్ని సులభతరం చేసే ఒప్పందాలపై కార్మికులను పంపే దేశాలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







