ఖతార్ లో 2025 మోడల్ ఫోర్డ్ బ్రోంకో రీకాల్..!!
- July 09, 2025
దోహా: ఖతార్‌లోని ఫోర్డ్ డీలర్ అయిన అల్మానా మోటార్స్ కంపెనీ ఫోర్డ్ బ్రోంకో 2025 మోడల్‌ను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని వాహనాలలో చైల్డ్ సేఫ్టీ లాక్ "ఆన్" అని చూపుతున్నా.. ఎడమ వైపు వెనుక తలుపు వాహనం లోపలి నుండి తెరుచుకుంటుంది. దీని కారణంగా అందులోని ప్రయాణీకులకు గాయాలయ్యే ప్రమాదం పెరుగుతుందని తెలిపింది.
ఈ ప్రమాదం నుండి వినియోగదారులను రక్షించడానికి, కార్ డీలర్లు వాహన లోపాలను సరిచేయడానికి వీలుగా రీకాల్ చేశారని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డీలర్‌తో సమన్వయం చేసుకుంటూ.. కస్టమర్‌లతో కమ్యూనికేట్ అవుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏవైనా ఉల్లంఘనలను గమనించినట్లయితే, వినియోగదారుల రక్షణ , వాణిజ్య మోసాల నిరోధక విభాగానికి నివేదించాలని వినియోగదారులకు సూచించింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







