విమాన ఇంజిన్‌లో చిక్కుకుని వ్యక్తి మృతి..!!

- July 09, 2025 , by Maagulf
విమాన ఇంజిన్‌లో చిక్కుకుని వ్యక్తి మృతి..!!

మనామా: ఉత్తర ఇటలీలోని బెర్గామో విమానాశ్రయంలో టేకాఫ్ కావడానికి సిద్ధమవుతున్న విమానం ఇంజిన్‌లో ప్రమాదవశాత్తు ఇరుక్కుని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు విమానాశ్రయ ప్రతినిధి వెల్లడించారు. మృతుడు ప్రయాణికుడు, విమానాశ్రయ ఉద్యోగి కాదని, అతను 35 ఏళ్ల ఇటాలియన్ అని,  రన్‌వేపైకి బలవంతంగా చొరబడ్డాడని, విమానాశ్రయ భద్రతా సిబ్బంది గుర్తించి అతన్ని వెంబడించారని విమానాశ్రయ నిర్వహణ సంస్థ SACBO ప్రతినిధి వెల్లడించారు.  ఈ సంఘటన తర్వాత ఇటలీలో మూడవ అతిపెద్ద ప్రయాణీకుల సంఖ్య కలిగిన బెర్గామో విమానాశ్రయంలో విమాన సర్వీసులను నిలిపివేశారు. కొన్ని గంటల తర్వాత సర్వీసులు తిరిగి ప్రారంభమైనట్లు SACBO తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com