సహెల్ యాప్‌లో గృహ కార్మికులకు ఎగ్జిట్ పర్మిట్.. కువైట్ క్లారిటీ..!!
- July 09, 2025
కువైట్: కువైట్ లో పనిచేసే గృహ కార్మికులు స్వదేశానికి వెళ్చే ముందు “సహెల్” అప్లికేషన్ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ పొందాలన్న వార్తలను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) తోసిపుచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అటువంటి విధానం లేదని PAM స్పష్టం చేసింది. అలాంటి వార్తల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది.
ప్రయాణ తేదీలను పేర్కొనడం, సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేయడం ద్వారా స్పాన్సర్‌లు సహెల్ యాప్‌లోని “పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్” విభాగం ద్వారా ఎగ్జిట్ పర్మిట్ పొందవచ్చు అని తప్పుదారి పట్టించే వార్తలను నమ్మవద్దని తన వివరణలో అథారిటీ వెల్లడించింది.
ఇప్పటి వరకు ప్రవాస కార్మికులకు అధికారికంగా ఎగ్జిట్ పర్మిట్ ప్రక్రియ ప్రవేశపెట్టబడలేదని PAM తెలిపింది. అధికారిక ప్రభుత్వ వనరుల నుండి వచ్చే సమాచారంపై ఆధారపడాలని, ధృవీకరించని వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండాలని అథారిటీ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్‌లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్‌లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







