సౌదీలో 21 నాన్ ప్రాఫిట్ సంస్థలు, 26 వెబ్‌సైట్‌లపై చర్యలకు ఆదేశాలు..!!

- July 09, 2025 , by Maagulf
సౌదీలో 21 నాన్ ప్రాఫిట్ సంస్థలు, 26 వెబ్‌సైట్‌లపై చర్యలకు ఆదేశాలు..!!

రియాద్: సౌదీ నేషనల్ సెంటర్ ఫర్ నాన్‌ప్రాఫిట్ సెక్టార్ (NCNP).. 21 వాణిజ్య సంస్థలు, 26 వెబ్‌సైట్‌లతో సహ ముగ్గురు ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అనేక లాభాపేక్షలేని సంస్థలు, వ్యక్తులు సంబంధిత చట్టాలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని నిర్ధారణ కావడంతో చర్యలకు ఆదేశించారు.  ఆయా సంస్థల డైరెక్టర్ల బోర్డును తొలగించాలని ఆదేశించింది. ఆయా సంస్థలకు భారీగా జరిమానాలు విధించాలని సూచించింది. విరాళాల ఉల్లంఘనలకు సంబంధించి 39 కేసులలో నాలుగు సంస్థలపై నిధుల సేకరణ ఉల్లంఘనల కింద జరిమానాలు విధించింది.  

మరోవైపు, జూన్ 2025 చివరి నాటికి సౌదీలో నమోదైన లాభాపేక్షలేని సంస్థల మొత్తం సంఖ్య 6,348కి చేరుకుంది. కేంద్రం లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలు సేకరించడానికి 250 లైసెన్స్‌లను కూడా జారీ చేసింది. నాన్ ప్రాఫిట్ రంగాన్ని నియంత్రించే నిబంధనలు, మార్గదర్శకాలు, విధానాలకు ఆయా సంస్థలు కట్టుబడి ఉండాలని NCNP స్పష్టం చేసింది. ఏదైనా ఉల్లంఘనలను గుర్తింస్తే ncnp.gov.sa ఇమెయిల్ ద్వారా , సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నివేదించాలని పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com