16 & 17 తారీకుల్లో 'సదరన్ ట్రావెల్స్‌' వారి హాలిడే బజార్

- July 14, 2016 , by Maagulf
16 & 17 తారీకుల్లో 'సదరన్ ట్రావెల్స్‌' వారి హాలిడే బజార్

చారిత్రక ప్రాంతాలతో పాటు దేశంలోని పుణ్యక్షేత్రాలకు ప్యాకేజీ టూర్లు నిర్వహించడంలో ఖ్యాతి గాంచిన సదరన్‌ ట్రావెల్స్‌ హాలిడే బజార్‌ పేరిట తెలంగాణలోని నాలుగు ప్రాంతాల్లో ఈ నెల 16, 17 తేదీల్లో రాయితీతో ప్యాకేజీ టూర్లను బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. గురువారం లక్డీకాపూల్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రావెల్స్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏవీ ప్రవీణ్‌కుమార్‌ హాలిడే బజార్‌ విశేషాలను వెల్లడించారు. సదరన్‌ ట్రావెల్స్‌ కార్యాలయాలు లేని కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా తమ ట్రావెల్స్‌ సేవలను అందుబాటులో ఉంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని హోటల్‌ అశోకాలో, వరంగల్‌ హన్మకొండ బాలసముద్రం వద్ద ఉన్న హోటల్‌ హరిత కాకతీయలో, కరీంనగర్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ ఎదురుగా ఉన్న హోటల్‌ ప్రతిమ రెసిడెన్సీలో, నిజామాబాద్‌ ఫులాంగ్‌ ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న హోటల్‌ వంశీ ఇంటర్నేషల్‌లో రెండురోజులు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు హాలిడే బజార్‌ కొనసాగుతుందన్నారు. ఇందులో మలేషియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక, యూరప్‌, అమెరికాలతో పాటు చార్‌థామ్‌, కశ్మీర్‌, సిమ్లా, కులీమనాలి, జైపూర్‌, అలహాబాద్‌, వారణాసి తదితర టూర్లతో పాటు కొత్తగా ప్రవేశపెడుతున్న కోస్టల్‌ కర్ణాటక, గుజరాత్‌ టూర్ల ప్యాకేజీలను బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఈ రెండురోజుల్లో బుక్‌ చేసుకున్న వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. తమ ప్యాకేజీలు బుక్‌ చేసుకున్న వారికి ఏసీ బస్సులు, ఏసీ హోటల్‌ గదులతో పాటు అనుభవం ఉన్న గైడ్‌లతో టూర్లు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com