ఈ-కామర్స్ సంస్థలు ఆన్లైన్లో పుర్రెలు..
- July 14, 2016
ఆన్లైన్లో ఈ-కామర్స్ సంస్థలు సెల్ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు, ఆహార పదార్థాలు వంటివి అమ్ముతాయని మనకు తెలుసు. కానీ పుర్రెలు కూడా అమ్ముతాయని తెలుసా. అవును ఇది నమ్మలేని నిజం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈబే అదే పని చేసింది. సెకండ్ హ్యాండ్ వస్తువులను ఆన్లైన్లో వేలం పెట్టే ఈ సంస్థ పుర్రెలను వేలానికి పెట్టింది. పుర్రెల్లో ఇండియా, చైనాకు చెందినవే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 237 మంది 454 పుర్రెలను అమ్మకానికి ఉంచారు.అమ్మకానికి ఉంచిన వారిలో అమెరికాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఏడు నెలలుగా పుర్రెల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో అత్యధికంగా ఒక పుర్రె రూ. 3 లక్షలు పలకగా, ఇంకొక పుర్రె తక్కువగా రూ.50 వేలు పలికింది. ఇంతకు ఈ పుర్రెలను ఏం చేస్తారనుకుంటున్నారా..వీటిని వైద్య ప్రయోగాలకు ఉపయోగిస్తామంటున్నారు. కానీ ఈ పుర్రెలు పురావస్తు తవ్వకాల్లో దొరికినట్టుగా కొందరు అనుమానిస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈబే పుర్రెల అమ్మకాన్ని నిషేధించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







