విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న ఏపీ వారికి హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు..
- July 10, 2025
అమరావతి: జీవనోపాధి కోసం కొందరు పుట్టిన ఊరుని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. అక్కడైతే మంచి ఉద్యోగాలు దొరుకుతాయని, జీతం ఎక్కువగా వస్తుందని, తమ కష్టాలు తీరతాయని అనుకుంటారు. కానీ, అక్కడికి వెళ్లాకే తెలుస్తోంది అసలు విషయం. వారు పడే ఇబ్బందులు, అవస్థలు అన్నీఇన్నీ కావు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు ఎందరో. అక్కడ ఉండలేరు, స్వదేశానికి తిరిగి రాలేరు. వారు పడే బాధ అంతా ఇంతా కాదు. తమను ఆదుకోవాలని అధికారులను వేడుకునే వారు ఎందరో.ఈ క్రమంలో విదేశాల్లో ఇబ్బందుల్లో ఉండే తెలుగువారికి అండగా నిలిచారు మంత్రి నారా లోకేశ్. అలాంటి వ్యక్తుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.
థాయిలాండ్‌లో కొందరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకులు మోసపోయారని తనకు తెలిసిందని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ, డిజిటల్ ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్లిన యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయారని తెలిసిందన్నారు.అలా మోసపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఇక, ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే.. +91-863-2340678.. వాట్సాప్ నెంబర్ 85000 27678. విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారు ఈ నెంబర్లను సంప్రదించాలని మంత్రి లోకేశ్ చెప్పారు.
తాజా వార్తలు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!