త్వరలో ఫ్లైట్ టిక్కెట్స్, డ్యూటీ ఫ్రీలో క్రిప్టోకరెన్సీలో షాపింగ్..!!
- July 10, 2025
యూఏఈ: దుబాయ్ ప్రధాన క్యారియర్ ఎమిరేట్స్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ బుధవారం క్రిప్టో.కామ్‌తో ఒప్పందాలపై సంతకం చేశాయి. ప్రయాణికులు విమాన టిక్కెట్లు, షాపింగ్ కోసం డిజిటల్ కరెన్సీలో చెల్లించడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్ క్రిప్టో చెల్లింపుల కోసం వ్యవస్థ వచ్చే ఏడాది అమలులోకి వస్తుందని భావిస్తున్నారు.
"మా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో క్రిప్టోకరెన్సీని అనుసంధానించడానికి క్రిప్టో.కామ్‌తో ఒప్పందం డిజిటల్ కరెన్సీలను ఇష్టపడే యువ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కస్టమర్ విభాగాలను ఉపయోగించుకోవడంతో పాటు, కస్టమర్ ప్రాధాన్యతలను తీర్చడంలో ఎమిరేట్స్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అని ఎమిరేట్స్ డిప్యూటీ ప్రెసిడెంట్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అద్నాన్ కాజిమ్ అన్నారు.
"మేము క్రిప్టో ను రోజువారీ వినియోగంలో తేవడానికి ఒప్పందం చేసుకున్నాము. రెండు కంపెనీలు తమ కస్టమర్లకు నిజమైన వినూత్న ఆర్థిక పరిష్కారాలను అందించడానికి ఇది వీలు కల్పిస్తుంది. GCCలో క్రిప్టో కోసం కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము." అని Crypto.com అధ్యక్షుడు, సీఒఒ ఎరిక్ అంజియాని అన్నారు.
మరోవైపు, దుబాయ్ డ్యూటీ ఫ్రీ కూడా స్టోర్‌లలో.. ఆన్‌లైన్‌లో క్రిప్టో చెల్లింపుల కోసం క్రిప్టో.కామ్‌తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. లక్షలాది మంది ప్రయాణికులను స్వాగతించే గ్లోబల్ హబ్‌గా, దుబాయ్ డ్యూటీ ఫ్రీ క్రిప్టోకరెన్సీ వంటి డిజిటల్ కరెన్సీ చెల్లింపులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయమని దుబాయ్ డ్యూటీ ఫ్రీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ సిదాంబి అన్నారు.
దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంవత్సరం మొదటి అర్ధభాగంలో బలమైన పనితీరును కనబరిచింది.ఇది Dh4.118 బిలియన్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.34 శాతం పెరుగుదల నమోదు చేసింది. యూఏఈలో చాలా మంది ప్రాపర్టీ డెవలపర్లు ఇప్పటికే కొనుగోలుదారుల నుండి క్రిప్టోకరెన్సీలను అంగీకరిస్తున్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







