ఖతార్‌లో ఆర్థిక మోసాల గురించి హెచ్చరిక జారీ..!!

- July 10, 2025 , by Maagulf
ఖతార్‌లో ఆర్థిక మోసాల గురించి హెచ్చరిక జారీ..!!

దోహా, ఖతార్: ఖతార్‌లో ఆర్థిక మోసాల గురించి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI)  హెచ్చరిక జారీ చేసింది.  పెట్టుబడిదారులు, పౌరులు, నివాసితులకు ఏదైనా పెట్టుబడి కార్యకలాపాలలో పాల్గొనడం, ఒప్పందాలపై సంతకం చేయడం లేదా పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నట్లు చెప్పుకునే కంపెనీలు లేదా సంస్థలకు నిధులను బదిలీ చేయడం వల్ల కలిగే నష్టాల గురించి హెచ్చరించింది.

ఏదైనా లైసెన్స్ లేని పార్టీకి నిధుల సేకరణ కార్యకలాపాలను నిర్వహించడానికి లేదా ప్రజలకు పెట్టుబడి సేవలను అందించడానికి చట్టబద్ధంగా అధికారం లేదని స్పష్టం చేసింది. అలాంటి సంస్థలతో కలిసి పనిచేస్తే పెట్టుబడిదారులు చట్టపరమైన, ఆర్థిక నష్టాలకు గురవుతారని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఏదైనా ఒప్పందాలు లేదా లావాదేవీలు కుదుర్చుకునే ముందు ఏదైనా వ్యక్తి లేదా సంస్థ చట్టబద్ధత , లైసెన్సింగ్ స్థితిని ధృవీకరించుకోవాలని.. మరింత సమాచారం కోసం అధికారిక మార్గాల ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com