యూఏఈలో UPI: త్వరలో ఫోన్ల ద్వారా పేమెంట్స్..!!
- July 11, 2025
యూఏఈ: యూఏఈకి వచ్చే భారతీయులు త్వరలో నగదు, కార్డులు లేదా చెల్లింపు సాధనాలు తేవాల్సిన అవసరం లేదు. కేవలం వారి పాస్‌పోర్ట్‌లు, ఫోన్ ఉంటే చాలు. వాటితోనే పేమెంట్స్ చేసే రోజులు త్వరలోనే రానున్నాయి. దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ..అన్ని ఆర్థిక లావాదేవీలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో చెల్లింపు చేసే రోజులు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు. యూఏఈలో UPI విస్తరణ జరుగుతుందన్నారు.
అయితే, యూఏఈలో UPI చెల్లుబాటు అనేది NPCI ఇంటర్నేషనల్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. లులు, దుబాయ్ డ్యూటీ ఫ్రీ వంటి ప్రధాన రిటైల్ చైన్స్ ఇప్పటికే యూపీఐని అందుబాటులోకి తీసుకువచ్చాయి. భారతీయ సందర్శకులు ఇప్పుడు తమ భారతీయ బ్యాంకు ఖాతాల నుండి నేరుగా చెల్లించడానికి మొబైల్ యాప్‌లను ఉపయోగించవచ్చు. తదుపరి దశలో యూఏఈ స్థానిక చెల్లింపు వ్యవస్థ AANIతో భాగస్వామ్యం ఏర్పాటు.. రెండు దేశాల మధ్య డిజిటల్ ఆర్థిక కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







