యూఏఈలో నైట్ డ్రైవింగ్ నేరాలు: 2024లో 30వేల వాహనాలకు ఫైన్స్..!!

- July 11, 2025 , by Maagulf
యూఏఈలో నైట్ డ్రైవింగ్ నేరాలు: 2024లో 30వేల వాహనాలకు ఫైన్స్..!!

యూఏఈ: యూఏఈలో వాహన ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ముఖ్యంగా నైట్ సమయంలో హెడ్‌లైట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లకు 2024లో సుమారు 30,000 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశారు.   డ్రైవర్లు సూర్యాస్తమయం తర్వాత వారి వాహన లైట్లను ఆన్ చేయాలని చట్టం నిర్దేశిస్తుంది.

దుబాయ్ లో అత్యధికంగా 10,706 ఉల్లంఘనలు నమోదయ్యాయి. తరువాత షార్జా 8,635, అబుదాబి 8,231 ఉల్లంఘనలు నమోదు అయ్యాయి.  ఎమరాత్ అల్ యూమ్ సేకరించిన డేటా ప్రకారం.. అజ్మాన్‌లో 1,393 ఉల్లంఘనలు, రస్ అల్ ఖైమాలో 907, ఉమ్ అల్ క్వైన్, ఫుజైరాలో వరుసగా 74, 67 ఉల్లంఘనలు నమోదయ్యాయి.

 Dh500 ఫైన్, నాలుగు బ్లాక్ పాయింట్లు

ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం.. రాత్రిపూట లైట్లు ఉపయోగించకుండా డ్రైవింగ్ చేసినందుకు లేదా లైట్లు ఉపయోగించకుండా పొగమంచులో డ్రైవింగ్ చేసినందుకు జరిమానా Dh500 జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధిస్తారు.  టెయిల్ లైట్ లేకపోవడం లేదా చెల్లని టర్న్ సిగ్నల్స్ కోసం జరిమానా Dh400, రెండు బ్లాక్ పాయింట్లు విధిస్తారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. యూఏఈ అంతటా ట్రాఫిక్ విభాగాలు గత సంవత్సరం 10,932 ఉల్లంఘనలను డ్రైవర్లపై జారీ చేశాయి. అబుదాబిలో 4,279, దుబాయ్‌లో 3,901, షార్జాలో 1,603, అజ్మాన్‌లో 764, రస్ అల్ ఖైమాలో 246, ఉమ్ అల్ క్వైన్‌లో 27, ఫుజైరాలో 112 నమోదయ్యాయి.

 దేశవ్యాప్తంగా ట్రాఫిక్ విభాగాలు గత సంవత్సరం లోపభూయిష్ట లైటింగ్ ఉన్న వాహనాలకు 34,811 ఉల్లంఘనలను జారీ చేశాయి. అబుదాబిలో 6,899, దుబాయ్‌లో 4,329, షార్జాలో 18,702, అజ్మాన్‌లో 4,707, ఉమ్ అల్ క్వైన్‌లో 26, ఫుజైరాలో 148 నోటీసులు జారీ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com