విజ్ఞానదాయకంగా సుజికాన్-2025 వాకథాన్

- July 12, 2025 , by Maagulf
విజ్ఞానదాయకంగా సుజికాన్-2025 వాకథాన్

మంగళగిరి: విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనైటో యూరినరీ సర్జన్స్ ఆధ్వర్యంలో, ప్రశాంత్ హాస్పిటల్ కేంద్రంగా నిర్వహిస్తున్న సుజికాన్-2025లో శనివారం ఓ విభిన్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రోస్టేట్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాకథాన్ నిర్వహించారు.ఎయిమ్స్ నుంచి సీకే కన్వెన్షన్ వరకు మొత్తం రెండున్నర కిలోమీటర్లు సాగిన ఈ యాత్ర విజ్ఞానదాయకంగా జరిగింది.ఈ వాకథాన్ ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమర్నాథ్ సింగ్, ఏఎస్యు ప్రెసిడెంట్ డాక్టర్ చెంగల్రాయన్ లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజికాన్-2025 ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సి.వి.సతీష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసరనేని మీడియాతో మాట్లాడుతూ..36వ సదరన్ యూరాలజిస్ట్స్ అసోసియేషన్ వార్షిక సదస్సు (సుజికాన్-2025) యూరాలజీ చికిత్సా రంగంలో కీలక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు.దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది యూరాలజిస్టులు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారని తెలిపారు. ప్రధాన యూరాలజికల్ సబ్‌ స్పెషాలిటీల్లో 50కి పైగా శాస్త్రీయ సెషన్‌ల నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాస్టర్‌ క్లాస్‌లు, ఆచరణాత్మక అభ్యాసంతో సహా 8 కేంద్రీకృత ఉప స్పెషాలిటీ సమావేశాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రోస్టేట్ సంబంధిత సమస్యల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ వాకథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రోస్టేట్ సమస్యలకు పలు ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.నవీన చికిత్సా విధానాలు, సాంకేతిక సంపత్తి ద్వారా మెరుగైన ఫలితాలను సాధించగలుగుతున్నామని వివరించారు. సదస్సులో తొలిరోజైన శుక్రవారం సైంటిఫిక్ సెషన్స్ తో పాటు ఆరు సర్జరీ లైవ్ వర్క్ షాపులు జరిగాయి. కార్యక్రమంలో ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, డాక్టర్ కె.ప్రశాంత్ కుమార్ కాసరనేని, కోశాధికారి డాక్టర్ జి.అజయ్ కుమార్, సైంటిఫిక్ కమిటీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ పి.శ్రీమన్నారాయణ, సోగస్ ఏపీ-తెలంగాణ కార్యదర్శి డాక్టర్ జి.శ్రీనివాసరావు, వాగస్ అధ్యక్షుడు డాక్టర్ జి.రవిశంకర్, సుజికాన్-2025 చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ సి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com