మహిళా స్వయం సహాయక కేంద్రాలకు రూ.344 కోట్లు వడ్డీలేని రుణాలు: మంత్రి సీతక్క
- July 12, 2025
హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుభవార్త చెప్పింది.ప్రభుత్వం చెప్పిన మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాల ను విడుదల చేసింది.ఈ మేరకు సెర్కు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. దీనిలో రూ.300 కోట్లు గ్రామీణ మహిళ సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించింది.
ఈ నెల 18 వరకు ఖాతాల్లో వడ్డీ జమ
శనివారం నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు సైతం ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారని వివరించారు. బిఆర్ఎస్ హయంలో వడ్డీలేని రుణాలు నిలిచిపోయాయని తెలిపారు.రూ.3000 కోట్లకు పైగా బిఆర్ఎస్ సర్కార్ బకాయిలు పెట్టిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సకాలంలో వడ్డీలేని రుణాల చెల్లింపు జరుగుతోందని తెలిపారు. దీంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాల్లో అనూహ్య వృద్ధి జరుగుతుందని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







