నీస్‌లో జరిగిన ఘటన బాగో లేదు : వర్మ
- July 15, 2016
ఫ్రాన్స్‌లోని నీస్‌లో బాస్టిల్ డే సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఓ ట్రక్కు మృత్యుశకటంలా ప్రజలపైకి దూసుకెళ్లి 80 మందికి పైగా బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా మరోసారి తనదైన శైలిలో స్పందించారు.'నీస్‌లో జరిగిన ఘటన బాగో లేదు. ఇలాంటి తీవ్ర ఘటనలు ఎక్కడైనా జరగొచ్చు. జరగకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాలని ఉంది కానీ ఏ దేవుడిని ప్రార్థించాలో తెలియడంలేదు. ఇలాంటి సామూహిక హత్యలు చేయడానికి బాంబులు అవసరంలేదు, వాహనాలు ఉంటే చాలని ఈ ఘటన నిరూపించింది. నీస్ దాడిని ఖండిస్తున్నాం అంటూ రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జోకుల్లాగా మారిపోయాయి. ఇలాంటి దాడులకు పాల్పడే క్రూరులు మంచి మాటలు వింటారా?' అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు వర్మ.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







