అభిమానులకు షాక్ ఇచ్చిన చెర్రీ..
- July 15, 2016
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ ధృవ. తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ కు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్ లో కేవలం మూడు పాటలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఒకటి టైటిల్ లో వస్తుంది. మరోటి బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది. మూడో పాట సెకండ్ హాప్ లో రొమాంటిక్ సిచ్యూవేషన్ లో వస్తుంది. దీంతో ఈ సినిమాలో హీరోకి ఇరగదీసి స్టెప్పులేసే అవసరం రాలేదు.అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం భారీ మార్పులు చేసారన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా చెర్రీ డ్యాన్స్ లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి.. ప్రత్యేకంగా చెర్రీ డ్యాన్స్ ల కోసమైనా పాటలను యాడ్ చేసి ఉంటారని భావించారు. చెర్రీ.., తన మాస్ డ్యాన్స్ ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చాడు. హైఇంటెన్సిటీతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ లో అనవసరంగా పాటల ఇరికించటం వల్ల, సినిమా ఫ్లో దెబ్బతింటుందన్న ఉద్దేశంతో తెలుగు వర్షన్ ను కూడా మూడు పాటలతోనే ముగించేస్తున్నారట. అంటే చెర్రీ డ్యాన్స్ లు చూడాలంటే అభిమానులు మరో సినిమా వరకు వెయిట్ చేయాల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సంగీత దర్శుడు హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ కు రెడీ అవుతోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







