సహజీవనం చేస్తున్న మహిళకు 32 కత్తిపోట్లు పొడిచిన ప్రియుడు

- July 15, 2016 , by Maagulf
సహజీవనం చేస్తున్న మహిళకు 32 కత్తిపోట్లు పొడిచిన ప్రియుడు

నోయిడా : ఏడాది కాలంగా తనతో సహజీవనం చేస్తున్న మహిళ పెళ్లాడాలని ఒత్తిడి చేసిందనే కోపంతో ఆమెను 32 సార్లు కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తి ఉదంతం నోయిడా నగరంలో వెలుగు చూసింది. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం శక్తిఖండ్‌కు చెందిన వరుణ్ గోయల్ (27) జిమ్ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. గోరఖ్ పూర్ జిల్లాకు చెందిన మహిళ ఆరేళ్లుగా తన భర్తతో దూరంగా ఉంటున్నారు. క్రమంలో తన సోదరుడు ఉంటున్న ఘజియాబాద్ కు వచ్చిన   మహిళ నోయిడాలోని మొబైల్ టాబ్లెట్ కంపెనీ ఉద్యోగంలో చేరారు. మహిళ తరచూ జిమ్ కు వస్తుండటంతో జిమ్ ట్రెయినర్ గా పనిచేస్తున్న వరుణ్ తో పరిచయం ఏర్పడింది. దీంతో నోయిడాలోని సెక్టార్ 73లో ఉన్న మహిళ అపార్టుమెంట్ లో వరుణ్ మహిళతో గత ఏడాది కాలంగా  సహజీవనం చేస్తున్నాడు. వివాహం విషయమై వారిద్దరి మధ్య వివాదం రాజుకుంది. తనను పెళ్లాడాలని ఒత్తిడి చేయడంతో ఆగ్రహం చెందిన వరుణ్ వంటగది నుంచి తెచ్చుకున్న కత్తితో మహిళను 32 పోట్లు పొడిచి తర్వాత పరారయ్యాడు. దీంతో అపార్టుమెంట్ నుంచి ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి మహిళను ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com