రాచకొండ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ దంపతులు
- July 17, 2025
హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. అనేక మంది మావోలు ఆయుధాలు విడిచిపెట్టి జనంలోకి వస్తున్నారు.తాజాగా రాచకొండ పోలీసుల ఎదుట ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్, ఆయన భార్య దీనా పోలీసులకు సరెండర్ అయ్యారు.
ఆంధ్ర, తెలంగాణ, దండకారణ్య ప్రాంతంలో ఈ ఇద్దరు మావోయిస్టులు పనిచేస్తున్నారు. గద్దర్‌తో పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా సంజీవ్ ఉన్నారు.అలాగే దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రెటరీగా కూడా సంజీవ్ పనిచేశారు.సంజీవ్‌తో పాటు ఆయన భార్య దీనా కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరిని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీపీ సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. రెండు రోజుల క్రితం ఆత్రం లచ్చన్న, చౌదరీ అంకు భాయి రామగుండం పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. వారం వ్యవధిలోనే నలుగురు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







