సౌదీ అరేబియాలో టెక్ టాలెంట్ స్కూల్స్ విస్తరణ..!!
- July 19, 2025
రియాద్: సౌదీ అరేబియా విద్యా మంత్రిత్వ శాఖ.. తువైక్ అకాడమీతో భాగస్వామ్యంతో రియాద్, మదీనా, తూర్పు ప్రావిన్స్, ఖాసిమ్, జెద్దాలో ఐదు కొత్త టెక్ టాలెంట్ పాఠశాలలను 1447 విద్యా సంవత్సరం నుండి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక పాఠశాలలో మొదటి సంవత్సరం సెకండరీ విద్యార్థులకు సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలను బోధించనున్నారు.
డిసెంబర్ 2024లో రియాద్‌లో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కింగ్‌డమ్‌లోని మొట్టమొదటి ప్రభుత్వం నిర్వహించే టెక్నాలజీ హైస్కూల్ విజయవంతంగా ప్రారంభించారు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకాట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాలలో విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందిస్తున్నారు. ఇంటెన్సివ్ టెక్ ప్రోగ్రామ్, క్రిటికల్ థింకింగ్ కోర్సులు, నాయకత్వ శిక్షణతో సహా అభివృద్ధి ట్రాక్‌ల నుండి విద్యార్థులు కూడా ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







