ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4..
- July 19, 2025
తెలుగు ఓటీటీ ఆహాలో రెగ్యులర్ గా కొత్త సినిమాలు, షోలు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయాడానికి సాంగ్స్, డ్యాన్స్ షోలను కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఇండియన్ ఐడల్ అంటూ లోకల్ సింగర్స్, తెలుగు వాళ్ళ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి షోని తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ చేసారు.ఇప్పటికే ఈ షో మూడు సీజన్లు పూర్తవగా త్వరలో నాలుగో సీజన్ మొదలు కానుంది.
గత కొన్ని రోజులుగా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కి ఆన్లైన్ లో ఆడిషన్స్ అవ్వగా ఇప్పుడు ఆఫ్ లైన్ లో ఆడిషన్స్ ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్ లోని JNTUH మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రిషి ఎమ్.ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్ట్ 3న గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్టు ఆహా ప్రకటించింది.
ఇంకెందుకు ఆలస్యం మీలో మంచి సింగర్ ఉంటే ఈ ఆడిషన్స్ కి వెళ్లి ఆహా షోలో పాడే ఛాన్స్ కొట్టేయండి. ఇక ఈసారి కూడా తమన్, గీతామాధురి, కార్తీక్ లు జడ్జీలుగా ఉండబోతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







