రోజురోజుకి కొత్తదనం రూపుదిద్దుకుంటున్న 'కబాలి' ప్రొమోషన్స్
- July 15, 2016
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రంపై అభిమానుల ఆశలు కొండెక్కాయి. రజినీ అభిమానులకు కబాలి ఫీవర్ పట్టుకుంది. కబాలి ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఫ్యాన్స్ కబాలి సినిమాను పలురకాలుగా ప్రమోట్ చేస్తున్నారు. కోయంబత్తూరులో ఓ కోలివుడ్ కేఫ్‌ను కబాలి పోస్టర్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రజనీ ఫోటోలతో సుందరంగా అలకరించారు. కబాలి పంచ్ డైలాగ్‌లను గోడలపై రాయడంతో రజినీ అభిమానుల్లో నూతనోత్తేజం వస్తోంది. సూపర్ స్టార్ జీవిత విశేషాలను కూడా కేఫ్‌లో అందుబాటులో ఉంచారు. ఆరడుగుల కబాలి పోస్టర్‌ను ఉంచడంతో అభిమానులు సెల్ఫీలు దిగుతున్నారు. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెలుపు, ఎరుపు బార్డర్స్ ఉండే విధంగా నీలం రంగు ధోతిలకు, కబాలి పోస్టర్లో టీ షర్ట్స్ తయారు చేయాలని తిర్పూర్ గార్మెంట్స్‌కు వందలాది ఆర్డర్లు ఇచ్చారు. సినిమా విడుదల రోజున భారీ ఎత్తున పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు అభిమానులు. కబాలి సక్సెస్‌కు సూపర్ స్టార్ అభిమానులు అన్ని విధాలా శ్రమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేసుకున్నారు అభిమానులు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







