రాహుల్ సిప్లిగంజ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరానా
- July 20, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రజల గర్వంగా నిలిచిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆయనకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం తరఫున ప్రకటించారు.
పాతబస్తీ నుంచి తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించిన రాహుల్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "నాటు నాటు" పాట ద్వారా ఆస్కార్ వరకూ తన ప్రతిభను చాటారు. తన కష్టమే తన విజయానికి కారణమని నిరూపించిన రాహుల్, తెలంగాణ యువతకు ప్రేరణగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, రాహుల్‌కి పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తామని హామీ ఇచ్చారు.తాజాగా ఆ మాటను నిలబెట్టుకుంటూ, బోనాల సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
ఇటీవల జరిగిన గద్దర్ అవార్డు కార్యక్రమంలో కూడా సీఎం రాహుల్ సిప్లిగంజ్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, త్వరలోనే ప్రభుత్వం నుండి బహుమతి ప్రకటన ఉంటుందని సూచించారు. ఆ ప్రకటనకు అర్థం ఇవాళ పాతబస్తీ బోనాల వేడుకల్లో స్పష్టమైంది.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం