ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో 8 మంది నిందితులు
- July 20, 2025
అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు మరో 8 మందిని నిందితులుగా చేర్చారు. ఈ విషయాన్ని ప్రాథమిక అభియోగ పత్రం (ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్)లో సిట్ (CIT) పేర్కొంది. నిన్న శనివారం కోర్టులో సిట్ ప్రిలిమినరీ ఛార్జ్‌షీటు దాఖలు చేసింది.తాజాగా నిందితులుగా చేర్చిన వారిలో ఎక్కువ మంది లిక్కర్ ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌లో పాత్రధారులు, ముడుపుల సొమ్ము భద్రపరిచిన డెన్లలోని సొత్తు హ్యాండ్లర్లు.
ముడుపుల వసూళ్లలో కీలక పాత్ర
ప్రధాన నిందితుడు రాజ్ కేసీరెడ్డి, మరో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిల ప్రతినిధులుగా వీరు ఈ స్కామ్‌లో కీలకంగా పని చేశారు. వీరిలో కొంత మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారు.వీరిలో పలువురు దుబాయ్‌లో, ఒకరిద్దరు అమెరికాలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.ఈ స్కామ్‌లో వీరి పాత్ర, ప్రమేయం గురించి ఛార్జ్‌షీటులో సిట్ ప్రస్తావించింది.
కొత్తగా చేర్చిన నిందితులు
తాజా నిందితుల్లో రాజ్ కేసీరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి సోదరుడు ముప్పిడి అనిరుథ్ రెడ్డి, ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాశ్ రెడ్డి, సైమన్ ప్రసన్ బావమరిది మోహన్ కుమార్, ముప్పిడి అనిరుథ్ రెడ్డి బావమరిది అనిల్ కుమార్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు, ఐఐటీ పూర్వ విద్యార్ధి సుజల్ బెహరూన్ లు ఉన్నారు.
వీరంతా లిక్కర్ ముడుపుల సొమ్ము వసూళ్లు, తరలింపు, డొల్ల కంపెనీల ద్వారా మళ్లింపులో కీలకంగా వ్యవహరించినట్లు సిట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







