WCL 2025లో భారత్ పాక్ మ్యాచ్ రద్దు..
- July 22, 2025
లండన్: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ రద్దు అవ్వడం పెద్ద చర్చకు దారితీసింది.దేశాల మధ్య ఉద్రిక్తతల వల్లే ఈ మ్యాచ్ ఆగిపోయిందని మొదట వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత, కొంతమంది భారత ఆటగాళ్లు మ్యాచ్ ఆడటానికి ఇష్టపడలేదని కూడా వినిపించింది.అయితే, ఇప్పుడు ఒక కొత్త విషయం బయటపడింది.మ్యాచ్ రద్దుకు భారత జట్టుకు ఎలాంటి తప్పు లేదని తేలింది.సోమవారం ఏఎన్ఐ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం.. డబ్ల్యూసీఎల్ నిర్వాహకులే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకి, తాము ఈ మ్యాచ్ను నిర్వహించలేకపోయామని చెప్పారట.
డబ్ల్యూసీఎల్ వర్గాలు చెప్పిన దాని ప్రకారం..భారత ఆటగాళ్లు మ్యాచ్ నుంచి తప్పుకోవడం వల్లే ఈ మ్యాచ్ రద్దు అయిందని, అందుకే పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు పాయింట్లను పంచుకోవడానికి అంగీకరించడం లేదని అంటున్నారు.అంటే, భారత్ వెనక్కి తగ్గింది కాబట్టి, తమకే పూర్తి పాయింట్లు ఇవ్వాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది.ఈ మ్యాచ్ గురించి నిర్వాహకులు మాట్లాడుతూ.. “మేమే మ్యాచ్ను నిర్వహించలేకపోయామని ఈసీబీకి చెప్పాం. ఇండియా ఛాంపియన్స్ జట్టుది తప్పు లేదు. కానీ పాకిస్థాన్ ఛాంపియన్స్ మాత్రం, భారత్ తప్పుకుంది కాబట్టి, పాయింట్లు పంచుకోవడానికి ఒప్పుకోవడం లేదు” అని చెప్పారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







