ఉపరాష్ట్రపతిగా నితీష్ కుమార్?
- July 22, 2025
న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్ థన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి ఉపఎన్నిక పదవికి ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించనుంది. అయితే ఇప్పుడు బీజేపీ పెద్దల దృష్టిలో ఉపరాష్ట్రపతి పదవికి ఎవరు ఉన్నారన్నది సస్పెన్స్ గా మారింది. పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ..ఒకే ఒక్క పేరుపై ఎక్కువ చర్చ జరుగుతోంది.ఆ పేరు బీహార్ సీఎం నితీష్ కుమార్.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి ఇప్పుడు ఓ సవాల్ గా మారింది.సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న నితీష్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది.ఇటీవలి కాలంలో ఆయన అంత చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు.విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.ఆరోగ్యం కూడా సరిగా లేదని అంటున్నారు.ఇలాంటి సమయంలో బీజేపీ, జేడీయూ సీఎం ఫేస్‌గా ఈ సారి నితీష్‌ను కాకుండా కొత్త వ్యక్తిని చూపించాలనుకుంటున్నారు.అయితే సీఎం నితీష్ ను తప్పించడం వల్ల బలమైన వర్గం అసంతృప్తికి గురైతే మొదటికే మోసం వస్తుంది.అందుకే నితీష్ ను అత్యున్నతంగా గౌరవిస్తున్నామని చెప్పేందుకు ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నితీష్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించి ఉన్నట్లయితే.. ఖచ్చితంగా ఆయన తదుపరి ఉపరాష్ట్రపతి అవుతారు.అదే సమయంలో..శశిథరూర్ తో సహా మరో ఇద్దరు కేంద్ర మంత్రుల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.మోదీ, షా రాజకీయ వ్యూహాల ప్రకారమే థన్‌ఖడ్ రాజీనామా చేసి ఉంటారు కాబట్టి..వారి ఆలోచనల ప్రకారమే తదుపరి ఎంపిక ఉంటుంది.వారెవరన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







