చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్
- July 23, 2025
అమరావతి: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన “హరిహర వీరమల్లు” చిత్రం జులై 24న విడుదలకు సిద్ధమైంది.ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ హాజరయ్యారు. అభిమానుల మధ్య మెరిసిన పవన్, సినిమాతో పాటు తన రాజకీయ భావోద్వేగాలపై కూడా స్పందించారు.ఈ వేళ పవన్ మాట్లాడుతూ, తన సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.అలాగే, సినిమా విజయం కోసం సోషల్ మీడియాలో మద్దతుగా పోస్ట్ చేసిన నారా లోకేశ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
తనపై జరుగుతున్న విమర్శలపై కూడా పవన్ స్పందించారు. “ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టాను అంటాడు” అంటూ విమర్శించే వారిని బావిలో కప్పలతో పోల్చారు. ఆవిషయాన్ని ఎత్తి చూపుతూ, తన పేరులోనే గాలి ఉందని, కాబట్టి ఎక్కడైనా ఉంటానని చురక వేశారు.పవన్, చిత్రరంగంలోకి రావడానికి ముందు విశాఖలో నటనలో నైపుణ్యం పెంచుకున్నట్టు తెలిపారు. బాల్యంలో తాను ఏవైనా కోరికలతో ఎదగలేదని, అయితే అన్యాయం జరిగితే నిలదీయాలనే తపన ఉండేదని చెప్పారు. డబ్బు కోసమో, ఫేమ్ కోసమో సినిమాల్లోకి రాలేదన్నారు.
తన జీవితంలో తన అన్నయ్య, వదిన ఇద్దరూ దేవతలే అని పవన్ చెప్పారు.వారి నమ్మకమే తనకు బలం అని వివరించారు. నటన కన్నా ఫిలిం మేకింగ్ పైనే ఎక్కువ ఆసక్తి ఉన్నదని తెలియజేశారు.ఈ సినిమా తొలుత క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమై 30% షూటింగ్ పూర్తయిందని చెప్పారు. అయితే, వ్యక్తిగత కారణాలతో క్రిష్ తప్పుకోవడంతో, దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చేపట్టి సినిమాను దూసుకుపోతున్నారని వివరించారు. సినిమా టీజర్‌తో అన్ని అనుమానాలూ తొలగిపోయాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!