భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- March 19, 2026
మనామా: బహ్రెయిన్ లోని సీఫ్ డిస్ట్రిక్ట్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనలో, గల్ఫ్ దేశానికి చెందిన ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.శిక్షాకాలం పూర్తయ్యాక అతడిని దేశం నుండి బహిష్కరించాలని ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం..ఆ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా అతని కారు అదుపు తప్పింది.ఈ ప్రమాదంలో తీవ్రమైన తల గాయాలతో అతని భార్య మరణించగా, అతని ఎడమ చేయి తీవ్రంగా విరిగింది.ఈ ఘటన లో ప్రభుత్వ ఆస్తులకు కూడా నష్టం వాటిల్లింది.
జాగ్రత్తలు
డ్రైవర్ ప్రాథమిక భద్రతా జాగ్రత్తలు పాటించడంలో విఫలమయ్యాడని దర్యాప్తులో నిర్ధారణ అయింది. అతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ నేరుగా అతని భార్య మరణానికి కారణమైందని, దాని పర్యవసానాలకు అతనే బాధ్యుడని కోర్టు తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







