అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు..

- July 15, 2016 , by Maagulf
అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు..

అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటుకు దిగడంతో టర్కీలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. టర్కీలో ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, అంకారాలలో తిరుగుబాటు అనుకూల సైనికులు, ప్రభుత్వ అనుకూల సైనికుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో 17మంది పోలీసు అధికారులు సహా 42 మంది చనిపోయారు. మృతుల్లో పౌరులే అధికంగా ఉన్నారు. ఈ ఘర్షణల్లో తిరుగుబాటు సైనికులదే పైచేయిగా ఉన్నట్టు ప్రాథమిక కథనాలు చాటుతున్నాయి. టర్కీలో సైనిక తిరుగుబాటు లైవ్ అప్ డేట్స్ ఇవి..టర్కీ పార్లమెంటు భవనం వద్ద రెంబు బాంబు పేళ్లులు, పలువురికి గాయాలుసైనిక తిరుగుబాటుదారుల విమానాన్ని కూల్చేసిన ప్రభుత్వ దళాలుసైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని ఎర్డోగాన్ పిలుపు.. సైనిక తిరుగుబాటును ధిక్కరిస్తున్న ఎర్డోగాన్ మద్దతుదారులుఅంకారాలోని టర్కీ అధ్యక్ష భవనం సమీపంలో బాంబులను విసిరిన జెట్ విమానంటర్కీలో కర్ఫ్యూ, సైనిక పాలన విధించిన మిలిటరీటర్కీ తీరప్రాంతమైన మార్మారీస్‌కు అధ్యక్షుడు ఎర్డోగాన్ విహాయాత్రకు వెళ్లడంతో ఇదే అదనుగా తిరుగుబాటుకు తెగబడ్డ సైన్యంవిహారయాత్ర నుంచి తిరిగొచ్చిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో మద్దతుదారుల ఘనస్వాగతంసైనిక తిరుగుబాటు దేశద్రోహమేనని ప్రకటించిన ఎర్డోగాన్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com