టర్కీలో నివసిస్తున్న భారతీయులెవరు వీధుల్లోకి రావొద్దని కేంద్ర ప్రభుత్వం ..
- July 15, 2016
సైనిక తిరుగుబాటుతో టర్కీలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడి భారతీయులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. టర్కీలో నివసిస్తున్న భారతీయులెవరు వీధుల్లోకి రావొద్దని, స్థానికంగా ఉన్న భారత రాయబార కార్యాలయంతో వారు నిత్యంలో టచ్ లో ఉండాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సూచించారు.టర్కీలో పరిస్థితులు కుదుటపడేవరకు ఆ దేశానికి భారతీయులు వెళ్లకూడదని, అక్కడికి ఏమైనా ప్రయాణాలు తలపెడితే మానుకోవాలని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో బహిరంగ ప్రజాప్రదేశాలకు వెళ్లకుండా ఇంట్లో ఉండటమే మంచిదని భారతీయులకు సుష్మ సలహా ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఎదురైతే ఈ హెల్ప్‌లైన్లు: అంకారా: +905303142203, ఇస్తాంబుల్ +905305671095 ద్వారా భారత రాయబార కార్యాలయ అధికారులను సంపద్రించాలని సుష్మ సూచించారు. టర్కీలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా అంచనా వేస్తున్నామని, అక్కడ ఉన్న భారతీయుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







