డిటెక్టివ్‌ కథతో 'ఏకే 57' : అజిత్‌

- July 15, 2016 , by Maagulf
డిటెక్టివ్‌ కథతో 'ఏకే 57' :  అజిత్‌

డిటెక్టివ్‌ కథతో 'ఏకే 57' : 'స్టార్‌'గా వెలుగుతున్నా... ఆ హోదాను ప్రదర్శించని వ్యక్తి అజిత్‌. అంతేకాదు... ప్రెస్‌మీట్‌, ప్రచారం, ప్రకటనలకూ అంతే దూరంగా ఉంటారాయన. సెట్‌లో మాత్రమే తన హీరోయిజాన్ని చూపి తర్వాత సాదాసీదాగా వ్యవహరిస్తుంటారు. ఇటీవల అజిత్‌ కొత్త చిత్రం 'ఏకే 57' (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రీకరణ కేళంబాక్కంలోని సాయిబాబా ఆలయంలో నిరాడంబరంగా ప్రారంభమైంది. అజిత్‌ చెన్నైలో ఉన్నప్పటికీ.. ఎప్పటిలాగానే ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. అజిత్‌తో 'వీరం', 'వేదాలం' తెరకెక్కించిన శివ... దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను తెలుసుకుందామా..
* అజిత్‌కు జోడీగా తొలుత ముద్దుగుమ్మ తమన్నాను ఎంపిక చేశారు. గతంలో అజిత్‌, తమన్నా కాంబినేషన్‌లో 'వీరం' సినిమా వచ్చింది. దీంతో అజిత్‌ సున్నితంగా తమన్నా వద్దని చెప్పడంతో ఆ అవకాశం అనుష్క వద్దకెళ్లింది. ఆమె తెలుగు సినిమాలు, తమిళంలో సూర్యతో నటిస్తుండటంతో ఖాళీ లేక సమస్య ఏర్పడింది. వాస్తవానికి మే ఒకటో తేదీన చిత్రీకరణ ప్రారంభించాలని అనుకున్నారు. అప్పటికైతే అనుష్క కాల్షీట్లు ఉన్నట్లు సమాచారం. ఆలస్యమవడంతో సమస్య ఎదురైంది. 'ఎన్నై అరిందాల్‌'కు ముందే అజిత్‌తో నటించాలని కాజల్‌ అగర్వాల్‌ అనుకున్నారు. ఇప్పటికి ఆ అవకాశం వచ్చింది. కొన్ని రోజుల్లోనే అధికారికంగా ఈ విషయం ప్రకటించనున్నారు.
* అన్నదమ్ములు, అన్నచెల్లెళ్లు సెంటిమెంట్‌తో గతంలో అజిత్‌, శివ కాంబినేషన్‌లో 'వీరం', 'వేదాలం' సినిమాలు వచ్చాయి. దీంతో ఈ సారి ఏ సెంటిమెంట్‌ అయితే బాగుంటుందని శివ ఆలోచించారు. మళ్లీ అదే తరహా ఎందుకని డిటెక్టివ్‌ కథను ఎంచుకున్నారు.
* ఇందులో హాస్య పాత్రకు సంతానం తొలుత ఎంపికయ్యారు. ఆయన హీరో సబ్జెక్ట్‌ సినిమాలపై దృష్టి పెడుతుండటంతో ఆ స్థానంలో కరుణాకరన్‌ వచ్చారు. తంబిరాయమ్య కూడా ఉన్నారు. ఈ డిటెక్టివ్‌ కథలో విలన్‌దే కీలక పాత్ర అని సమాచారం. అందువల్లే సరికొత్త విలన్‌ను కోలీవుడ్‌లోకి తీసుకురావాలని కూడా శివ ప్రయత్నాలు సాగిస్తున్నారు.
* కాలికి శస్త్రచికిత్స కారణంగా కొంత కాలంగా విశ్రాంతి తీసుకోవడంతో నటుడు అజిత్‌ కాస్త బరువు పెరిగారట. కథకు తగ్గట్టు మారేందుకు.. రోజూ జిమ్‌లో కష్టపడుతున్నారు. ఇటీవల ముహూర్తపు రోజు పూజా కార్యక్రమం నిర్వహించిన చిత్రయూనిట్‌ ఆడి మాసం పూర్తయిన తర్వాత చిత్రీకరణకు వెళ్లనుంది.
* 'బిల్లా 2' మాదిరిగానే ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు విదేశాల్లో ఉంటుంది. అందులో బల్గేరియా ప్రధానం. త్వరలోనే సినిమా యూనిట్‌ అక్కడకు వెళ్లనుంది.
* మరో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే.. అజిత్‌ తదుపరి సినిమాను అమితాబ్‌ బచ్చన్‌ నిర్మిస్తున్నారు. గతంలో అజిత్‌ నటించిన 'ఉల్లాసం' కూడా అమితాబ్‌ తన ఏబీసీఎల్‌ బ్యానరులో నిర్మించారు. చాలా రోజుల తర్వాత మళ్లీ వీరు జట్టు కట్టనున్నారు. వీరిద్దరికి మంచి మిత్రులైన ప్రభు ద్వారా ఈ ప్రాజెక్టుకు బీజం పడినట్లు సమాచారం. ఈ సినిమాకు అట్లిగానీ, విష్ణువర్ధన్‌గానీ దర్శకత్వం వహించే అవకాశముంది. ఇందులో మరో హీరో కూడా ఉంటారని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com