వచ్చే ఏడాది ITR ఫైలింగ్‌లో కొత్త మార్పులివే..

- July 25, 2025 , by Maagulf
వచ్చే ఏడాది ITR ఫైలింగ్‌లో కొత్త మార్పులివే..

న్యూ ఢిల్లీ: పన్నుచెల్లింపుదారులకు గుడ్ న్యూస్..అతి త్వరలో ఆదాయపు పన్ను బిల్లు 2025 రాబోతుంది. ఆదాయపు పన్నుకు సంబంధించి లోక్‌సభ సెలెక్ట్ కమిటీ (Income Tax Bill 2025) జూలై 21న 4,500 పేజీల నివేదికను సమర్పించింది. 1961 నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఆదాయపు పన్ను బిల్లు 2025లో కీలకమైన మార్పులను సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పార్లమెంటరీ పరిశీలనలో ఉన్నాయి. ప్రధానంగా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ప్రక్రియ సులభతరం కానుంది. రీఫండ్ హక్కుదారులు, గృహ కొనుగోలుదారులు, జీతం సంపాదించేవారికి ప్రత్యక్ష ప్రయోజనాలు దక్కనున్నాయి.

ప్రస్తుత ఆదాయపు పన్ను భాషను అర్థం చేసుకోవడం సామాన్యులకు చాలా కష్టంగా మారింది. కానీ, కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 ద్వారా ఈ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సామాన్యులు కూడా ఆదాయపు పన్ను బిల్లును సులభంగా అర్థం చేసుకోగలరు. తద్వారా ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పులకు తక్కువ అవకాశం ఉంటుంది.

కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025లో సరళమైన భాషను వాడారు.దాంతో టాక్స్ పేయర్లు ఐటీ నిబంధనలను ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తప్పుడు వివరణల అవకాశాన్ని తగ్గించవచ్చు. కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త పన్ను వ్యవస్థను రూపొందిస్తోంది.ఇందులో భాగంగా కేంద్రం డిజిటల్ పన్ను విధానమే లక్ష్యంగా 285 మార్పులు చేయనుంది.ఈ మార్పులు ఆమోదం పొందితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తుంది.

1.ITR ఫైలింగ్ ఆలస్యమైనా వారికి రీఫండ్ పెనాల్టీ ఉండదు:

పన్ను చెల్లింపుదారులకు అత్యంత ముఖ్యమైన వాటిలో క్లాజ్ 479 ఒకటి. ప్రస్తుతం ఆలస్యంగా ITR దాఖలు చేసినందుకు రూ. వెయ్యి వరకు జరిమానా చెల్లించాలి. ఒక వ్యక్తి రీఫండ్ కోసం మాత్రమే ఐటీఆర్ దాఖలు చేస్తే.. మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోయినా ఆలస్యమైనందుకు ఎలాంటి జరిమానా పడదు. ఈ కొత్త మార్పు అమల్లోకి వస్తే.. పన్ను లేని ఆదాయం కలిగిన లక్షలాది మంది టాక్స్ పేయర్లకు భారీగా ప్రయోజనం కలుగుతుంది.

2.గృహ, అద్దె ఆదాయంపై భారీ తగ్గింపులు:

ఇంటి అద్దెల ద్వారా వచ్చే ఆదాయం కింద రెండు కీలకమైన విషయాలను ప్రతిపాదించారు. మున్సిపల్ టాక్స్ తర్వాత ప్రస్తుత 30 శాతం స్టాండర్డ్ డిడెక్షన్ కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com