ఆగ‌స్టు 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో శ్రీవారి దివ్యానుగ్ర‌హ విశేష హోమం టికెట్లు

- July 25, 2025 , by Maagulf
ఆగ‌స్టు 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో శ్రీవారి దివ్యానుగ్ర‌హ విశేష హోమం టికెట్లు

తిరుప‌తి: తిరుప‌తి అలిపిరిలోని సప్త గోప్ర‌ద‌క్షిణ‌ మందిరంలో టీటీడీ ప్ర‌తి రోజు నిర్వ‌హించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హం టికెట్లును ఆగ‌స్టు 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో మాత్ర‌మే జారీ చేస్తారు.

ప్ర‌తి రోజు భ‌క్తులకు క‌రెంటు బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. భ‌క్తుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఆగ‌స్టు 1వ తేదీ నుండి మొత్తం 200 టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే జారీ చేయాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది.కావున భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.  

భ‌క్తుల‌ కోరిక మేర‌కు శ్రీవారి పాదాల వ‌ద్ద‌ త‌మ శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్లో స్వామివారి అనుగ్ర‌హం కోసం సంక‌ల్పం చెప్పుకుని య‌జ్ఞం నిర్వ‌హించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.ఈ విశేషహోమంలో రూ.1600/- చెల్లించి గృహ‌స్తులకు (ఇద్ద‌రు) పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న గృహస్తులకు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com