సోషల్‌మీడియా సైట్లను ప్రభుత్వం బ్లాక్ : టర్కీ
- July 16, 2016
టర్కీలో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్‌మీడియా సైట్లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌ను బ్లాక్ చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే సోషల్‌మీడియా సేవలను పునురుద్ధరించినట్లు ఓ రీసెర్చ్ ఏజెన్సీ తెలిపింది. అయితే దీనిపై ట్విట్టర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. సైట్‌ను పూర్తిగా బ్లాక్ చేయలేదని తెలిపారు. యూట్యూబ్ ప్రతినిధులు స్పందిస్తూ.. కొంతసేపు తమ సేవలు డౌన్ అయ్యాయని.. అయితే ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
టర్కీ సైన్యంలోని ఓ వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది పోలీసులు సహా 60 మంది మృతిచెందారు. తిరుగుబాటు నేపథ్యంలో 754 మంది సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







