కువైట్ లో ఆకట్టుకుంటున్న ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- July 26, 2025
కువైట్: కువైట్ లోని అవెన్యూస్ మాల్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ సందడి చేస్తోంది. మామిడి రంగులు, సువాసనలు , రుచులతో పండుగ వాతావరణం నెలకొన్నది. వ్యవసాయ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) సహకారంతో భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు.
చౌసా, మల్లికా, ఆమ్రపాలి, దుషేరి, ఫజ్లి, లాంగ్రా వంటి ప్రీమియం భారతీయ మామిడి రకాలు ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి. వీటిలో ఫజ్లి మామిడి ప్రతిష్టాత్మక భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ను కలిగి ఉంది.ఈ కార్యక్రమంలో సీనియర్ కువైట్ అధికారులు, రాయబారులు, దౌత్య కార్యాలయ సభ్యులు, పెద్ద సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు.
జూలై 25 నుండి 27 వరకు కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా, కువైట్‌లోని ప్రఖ్యాత భారతీయ రెస్టారెంట్ గొలుసు 'ఆశాస్' వివిధ అవుట్లెట్లలో మామిడి ఫెస్టివల్ ను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







