సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు ఘన స్వాగతం
- July 27, 2025
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకూ, 'బ్రాండ్ ఏపీ'ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు జులై 26 నుంచి 31 వరకు ఆరు రోజుల సింగపూర్ పర్యటనను ప్రారంభించారు.ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, మంత్రి పి.నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కూడా ఉంది.ఈ బృందం జులై 26 రాత్రి 11:15 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, జులై 27 ఉదయం 6:30 గంటలకు సింగపూర్ చేరుకుంది.
ఇవాళ చంద్రబాబు కార్యక్రమాలు:
జులై 27న చంద్రబాబు సింగపూర్‌లోని 'వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్' డిజిటల్ క్యాంపస్‌లో జరిగే 'తెలుగు డయాస్పొరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా' కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ సమావేశం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో సింగపూర్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల నుంచి సుమారు 1,500 నుంచి 5,000 మంది తెలుగు ప్రవాసీయులు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు అమరావతి మాస్టర్ ప్లాన్, పెట్టుబడి అవకాశాలు,పేదరిక నిర్మూలన కోసం P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్) కార్యక్రమం గురించి వివరిస్తారు.ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఇవాళ చంద్రబాబు భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో సమావేశమవుతారు.సుర్బానా జురాంగ్, ఎవర్సెండై ఇంజనీరింగ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.రాత్రి భారత హైకమిషనర్ ఆతిథ్యం ఇచ్చే విందులో చంద్రబాబు టీమ్ పాల్గొంటుంది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







