సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
- July 27, 2025
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, హౌసింగ్ ప్రాజెక్టులు వంటి అనేక రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేశారు. భారత్‌లో పెట్టబోయే పెట్టుబడులకు ఏపీ ‘గేట్ వే’గా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న సింగపూర్, ఇప్పుడు మళ్లీ పెట్టుబడుల కోసం ఆసక్తి చూపుతోందని తెలిపారు.
వివిధ రంగాల్లో భాగస్వామ్యం – సింగపూర్ కంపెనీలకు అవకాశం
గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నదని సీఎం తెలిపారు. విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఇప్పటికే మొదలయ్యాయని వెల్లడించారు. అమరావతిలో ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా దేశంలో తొలి క్యాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు విశాఖలో డేటా సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకొస్తున్నట్లు చెప్పారు. రాయలసీమలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టుల విషయానికొస్తే, మంత్రి నారాయణ ఏపీలో చేపడుతున్న పనులను వివరించారు.
సాంకేతిక నిపుణులకు డిమాండ్–విద్యారంగ సహకారంపై చర్చ
ఈ సమావేశంలో పాల్గొన్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న ప్రఖ్యాత విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు.భవిష్యత్తులో మరిన్ని అగ్రశ్రేణి విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా ఉన్నట్లు చెప్పారు. భారత హై కమిషనర్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెక్ నిపుణులకు సింగపూర్ వంటి దేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. సింగపూర్‌లోని సంస్థలు ఎలక్ట్రానిక్స్, ఫార్మా, షిప్ బిల్డింగ్, డేటా సెంటర్లు, స్టార్టప్‌లు, వైద్య పరికరాల పరిశోధనల వంటి రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాయని వివరించారు. ఏపీ-సింగపూర్ మధ్య విద్యా సహకారం, పరిశోధనల భాగస్వామ్యంపై చర్చలు జరిగినట్టు సమావేశానికి హాజరైన అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







