తమ ఇంటిని టీటీడీకి విరాళంగా ఇచ్చిన దంపతులు..
- July 29, 2025
తిరుమల: హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన టి.సునీత దేవి, టి.కనక దుర్గ ప్రసాద్ దంపతులు రూ.18.75 లక్షల విలువైన 250 చదరపు గజాల గల తమ ఇంటిని మంగళవారం శ్రీవారికి విరాళంగా అందించారు.
హైదరాబాద్ కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ భాస్కర్ రావు ఇటీవల తన మరాణానంతరం వీలునామా ద్వారా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రూ.3 కోట్లు విలువైన ఇంటిని, రూ.66 లక్షల బ్యాంకులోని ఫిక్సిడ్ డిపాజిట్లను టీటీడీకి విరాళంగా ఇవ్వడం విదితమే.
స్వర్గీయ భాస్కర్ రావు స్ఫూర్తితో టి.సునీత దేవి,టి.కనక దుర్గ ప్రసాద్ దంపతులు తమకు సంతానం లేకపోవడంతో తమ తదనంతరం తమ ఆస్తి శ్రీవారికి చెందేలా వీలునామా రాసి స్వామివారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు.
ఆస్తికి సంబంధించిన పత్రాలను మంగళవారం తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ సందర్భంగా స్వామివారి పై అపారమైన భక్తితో తమ ఇంటిని విరాళంగా ఇవ్వడం ఇతర భక్తులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని దాతలను అదనపు ఈవో అభినందించారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







