WCL టోర్నీ నుంచి భారత్ వాకౌట్..
- July 31, 2025
లండన్: ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ జరుగుతోంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ జట్టు సెమీస్‌కు చేరుకుంది. గురువారం సెమీస్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది.
అయితే.. పాక్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఆడబోమని భారత ఆటగాళ్లు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్‌తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలకు వ్యతిరేకంగా భారత జట్టు తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది.
గ్రూపు దశలోనూ పాక్‌తో ఆడేందుకు జట్టులోకి కీలక ఆటగాళ్లైన శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నీ నిర్వాహకులు గ్రూపు దశలో మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు.
ఇక ఇప్పుడు సెమీస్‌లో పాక్‌తో ఆడేది లేదని భారత్ స్పష్టం చేసింది. టీమ్ఇండియా సెమీస్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో పాక్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. మరో సెమీస్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుతో శనివారం పాక్ ఫైనల్ ఆడనుంది.
తాజా వార్తలు
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







