మంగోలియాలో గాంధీ విగ్రహం ఆవిష్కరించిన భారత ఉపరాష్ట్రపతి
- July 16, 2016
భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మంగోలియాలోని పెతబ్ ఆశ్రమంలో మహాత్మాగాంధీ రాతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారతదేశం-మంగోలియాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలకు ప్రతీకైన మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో శనివారం జాతిపిత విగ్రహావిష్కరణ జరిగింది. అనంతరం అన్సారీ భారత మాజీ రాయబారి కుషోన్ బకులా రింపోచే స్థాపించిన ఆశ్రమాన్ని సందర్శించారు.
1999లో రింపోచే స్థాపించిన పెతబ్ ఆశ్రమాన్ని అప్పటి భారత ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ ప్రారంభించారు. టిబెటన్ భాషలో పెతబ్ అంటే 'శ్రేష్ఠమైన' అని అర్థం. బౌద్ధ మతాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందనే భావనతోనే రింపోచే ఈ ఆశ్రమాన్ని నెలకొల్పారు.
గత ఏడాది భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి మఠాధిపతికి బోధి వృక్షం తాలూకు చిన్న మొక్కను బహూకరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







