గౌతమిపుత్ర శాతకర్ణికి కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా నీతాలుల్లా
- July 16, 2016
బాలకృష్ణ ఫిల్మ్ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి కొత్త వార్త. ఫస్ట్ లుక్‌లో బాలయ్య గెటప్, డ్రెస్ చూసి, దీనికి డిజైనర్ ఎవరనేది అన్న ప్రశ్నకు చాన్నాళ్లుగా సమాధానం లేదు. లేటెస్ట్ గా అందుకు సంబంధించిన సమాచారం బయటకువచ్చేసింది. ప్రజెంట్ జార్జియాలో శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ ఫిల్మ్‌కి కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా నీతాలుల్లా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. మూవీ ప్రారంభానికి ముందే నీతాని సంప్రదించి ఓకే చేశాడు క్రిష్. దాదాపు 300 సినిమాలకు డిజైనర్‌గా వ్యవహరించింది ఈమె!
హిస్టరీ నేపథ్యమున్న సినిమాలంటే కాస్ట్యూమ్స్ కీలకం. అందుకే శాతవాహనుల కాలానికి చెందిన ట్రెడిషన్‌ను క్షుణ్ణంగా స్టడీ చేసింది ఆమె. చాలావరకు రీసెర్చ్ చేసిన తర్వాత కాస్ట్యూమ్స్ కోసం డైరెక్టర్ క్రిష్, కెమెరామన్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ప్రతీ సీన్స్‌కు తగ్గట్టుగా డిజైన్‌లో నిమగ్నమైంది. సైనికులు ధరించే దుస్తుల విషయంలో కూడా ఆమె చాలా కేర్ తీసుకుంటోంది. గతంలో దేవదాసు, జోధాఅక్బర్ వంటి సినిమాలకు పనిచేసిన అనుభవం ఈమె సొంతం. అంతేకాదు మూడు జాతీయ అవార్డులను దక్కించుకుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







