ప్రధాని మోదీని కలిసిన చిన్నజీయర్ స్వామి
- July 31, 2025
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఆయనను ఇవాళ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు కలిశారు.
తెలంగాణ, ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ఠ అతిథిగా రావాలని మోదీని ఆహ్వానించారు. మోదీ సానుకూలంగా స్పందించారు.
మోదీకి చినజీయర్ స్వామి హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం విశేషాలను వివరించారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఉన్న 108 దివ్య దేశాలలో కొలువుతీరిన దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాలను ప్రధానికి తెలియజేశారు.45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద- హోమియో కళాశాల పురోగతి గురించి ప్రధాని ఆసక్తిగా తెలుసుకున్నారు.
ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావును అభినందించారు.
తాజా వార్తలు
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు
- దుబాయ్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!







