బహ్రెయిన్ లో రియల్ ఎస్టేట్ వృద్ధి.. BD775 మిలియన్ల లావాదేవీలు..!!
- August 03, 2025
మనామా: 2025 ప్రథమార్థంలో బహ్రెయిన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. 5,099 ఒప్పందాలలో జరిగిన లావాదేవీలు BD775.2 మిలియన్లకు చేరుకున్నాయని సర్వే అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ బ్యూరో అధ్యక్షుడు ఇంజినీర్ బాసిమ్ బిన్ యాకౌబ్ అల్ హామర్ తెలిపారు. 2024లో ఇదే కాలంలో నమోదైన BD745.8 మిలియన్లు, 5,005 లావాదేవీలు నమోదయ్యాయి. ఇక అత్యధిక సింగిల్-డే విలువైన లావాదేవీ ఏప్రిల్ 21న జరిగిందని, ఇది పెట్టుబడిదారులకు బహ్రెయిన్ పై ఉన్న ఆకర్షణను ప్రతిబింబిస్తుందన్నారు.
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే బహ్రెయిన్ కానివారిలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు 20.75% పెరిగాయని, బహ్రెయిన్ల లావాదేవీలు 4.39% పెరిగాయని అల్ హామర్ తెలిపారు. క్యాపిటల్ గవర్నరేట్ BD265.4 మిలియన్ల ఒప్పందాలతో(32.84% వృద్ధి) ముందంజలో ఉంది. దీని తరువాత ముహారక్ BD197.6 మిలియన్లు (13.52% వృద్ధి), నార్తర్న్ గవర్నరేట్ BD215.1 మిలియన్లు (5.82% వృద్ధి) ఉన్నాయి. ఇళ్ల లావాదేవీలు BD215 మిలియన్లు, గతేడాది కంటే 14.54% పెరుగుదల నమోదైంది. అపార్ట్మెంట్లు BD107.8 మిలియన్లు, 1.91% పెరిగాయని నివేదికలో వెల్లడించారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి