యూఏఈలో 51.8°C ఉష్ణోగ్రతలు: మూర్ఛ, వడదెబ్బ హెచ్చరికలు..!!

- August 03, 2025 , by Maagulf
యూఏఈలో 51.8°C ఉష్ణోగ్రతలు: మూర్ఛ, వడదెబ్బ హెచ్చరికలు..!!

యూఏఈ: ఆగస్టు 1న అల్ ఐన్‌లోని స్వీహాన్‌లో ఉష్ణోగ్రతలు 51.8°Cకి చేరాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఈ నేపథ్యంలో  యూఏఈలోని ఆరోగ్య నిపుణులు నివాసితులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.   

జూలై 29 నుండి ఆగస్టు 10 వరకు వాఘ్రత్ అల్ ఖైజ్ లేదా 'బర్నింగ్ హీట్' మధ్య అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇది డీహైడ్రేషన్,వడదెబ్బ వంటి  ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. ఇటీవలి రోజుల్లో వేడి సంబంధిత ఎమర్జెన్సీ కేసులు పెరుగుతున్నాయని, డీహైడ్రేషన్, వడదెబ్బ, అలసట, గుండె లేదా మూత్రపిండాల వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రతరం అవుతాయని బుర్జీల్ హోల్డింగ్స్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ హెల్త్‌లోని వాతావరణ ఆరోగ్య నిపుణుడు డాక్టర్ మొహమ్మద్ ఫిత్యాన్ అన్నారు.   ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు,  బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

తరచూ కొబ్బరి నీరు, నోటి రీహైడ్రేషన్ సొల్యూషన్స్, పుచ్చకాయ, బత్తాయి వంటివి తీసుకోవాలని ముస్ఫాలోని లైఫ్‌కేర్ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ బైజు ఫైజల్  సూచించారు.అలాగే,ప్రతిరోజూ కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల ద్రవాలను తీసుకోవాలన్నారు. వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరించాలని, ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఎండకు గురికాకుండా సన్‌స్క్రీన్ లోషన్/క్రీమ్ ఉపయోగించాలని సూచించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com