సిటీ చెక్-ఇన్ సేవ.. ఒమన్ ఎయిర్ ప్లాన్..!!
- August 05, 2025
మస్కట్: ఒమన్ ఎయిర్ లో మీ లగేజీ ప్రయాణానికి ముందే చెక్-ఇన్ , మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రిలాక్స్గా చేరుకునే రోజులు త్వరలోనే రానున్నాయి. చివరి నిమిషంలో బ్యాగ్ కౌంట్లు లేదా విమానాశ్రయంలో పొడవైన క్యూ లేకపోతే ప్రయాణాన్ని పూర్తి ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
ఒమన్ జాతీయ క్యారియర్ మస్కట్లో తన మొట్టమొదటి సిటీ చెక్-ఇన్ సెంటర్ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీని వలన ప్రయాణీకులు తమ బ్యాగులను డ్రాప్ చేసి వారి విమానానికి ముందు చెక్-ఇన్ చేయవచ్చు. ఈ కొత్త సేవ ప్రయాణికులు విమానాశ్రయ చెక్-ఇన్ లైన్లను స్కిప్ చేసి నేరుగా ఇమ్మిగ్రేషన్కు వెళ్లడానికి వీలు కల్పిస్తుంది.
ఒమన్ ఎయిర్ సలాలా నుండి ప్రయాణించే వారి కోసం సౌకర్యవంతమైన సిటీ చెక్-ఇన్ సేవను ప్రవేశపెట్టింది . ఇది బిజీగా ఉండే ఖరీఫ్ సీజన్లో ప్రయాణాన్ని సులభతరం చేసే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ట్రాన్సమ్ హ్యాండ్లింగ్తో భాగస్వామ్యంతో ప్రారంభించబడిన మరాహెబ్ సేవ, ప్రయాణీకులు సలాలా గార్డెన్స్ మాల్లో ప్రయాణ విధానాలను ముందుగానే పూర్తి చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. విమానాశ్రయ క్యూలను నివారించి, మరింత రిలాక్స్డ్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







