కొత్త బ్యాంకింగ్ ముసాయిదాను సమర్పించిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- August 05, 2025
రియాద్: సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ శాసనసభ అధికారులకు కొత్త బ్యాంకింగ్ ముసాయిదా చట్టాన్ని సమర్పించింది. ఇది ఆర్థిక నియంత్రణ చట్రాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 2025 ఆర్టికల్ IV మిషన్ తన తాజా నివేదికలో ప్రస్తావించింది.
సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ కొత్త బ్యాంకింగ్ చట్టాన్ని శాసనసభ ఆమోదం కోసం సమర్పించారని, రిస్క్-ఆధారిత చట్టాలను మెరుగుపరుస్తున్నామని, పెద్ద నిర్మాణ మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టామని IMF తెలిపింది.
దీంతోపాటు.. సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) దాని బ్యాంక్ పరిష్కార పనితీరును అమలు చేస్తోంది. అత్యవసర లిక్విడిటీ సహాయ చట్రాన్ని కలిగి ఉన్న సంక్షోభ నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయడంలో మంచి పురోగతి సాధించింది. మనీలాండరింగ్ నిరోధక, ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ (AML/CFT) పర్యవేక్షణ ప్రభావాన్ని తాజా చర్యలు పెంచుతాయని పేర్కొన్నారు.
సౌదీ అరేబియాలో చమురుయేతర GDP వృద్ధి, 2.2 శాతం వద్ద ఉన్న తక్కువ ద్రవ్యోల్బణం, విజన్ 2030 లక్ష్యాల కంటే నిరుద్యోగ స్థాయిలు ఉన్నాయని IMF తెలిపింది. బ్యాంకింగ్ రంగం 2024 చివరి నాటికి 19.6 శాతం సాల్వెన్సీ నిష్పత్తి, 2016 నుండి రికార్డు స్థాయిలో తక్కువ నిరర్థక రుణాలు, అధిక లాభదాయకత సూచికలు ఉన్నాయని ప్రశసించింది. వేగవంతమైన క్రెడిట్ విస్తరణ నుండి వచ్చే నష్టాలను పరిష్కరించడానికి SAMA స్పెషల్ టూల్కిట్ను సమీక్షిస్తోందని, అదే సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి 100-బేసిస్-పాయింట్ కౌంటర్సైక్లికల్ క్యాపిటల్ బఫర్ను ప్రవేశపెట్టిందని వెల్లడించింది.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







