మీ మాజీ గురించి ఆన్లైన్లో మాట్లాడుతున్నారా? Dh500,000 జరిమానా..!!
- August 05, 2025
యూఏఈ: విడాకుల గురించి వ్యక్తిగత వివరాలను పంచుకోవడానికి సోషల్ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారా? అలాంటి పోస్ట్లు పరువు నష్టం కిందకు వస్తాయని దీనికి సంబంధించి భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విదేశీ చట్టంలో భాగస్వామి, అంతర్జాతీయ కుటుంబ చట్ట నిపుణుడు బైరాన్ జేమ్స్ మాట్లాడుతూ.. యూఏఈలోని చట్టం ప్రకారం, పరువు నష్టం, గోప్యతా ఉల్లంఘనలు రెండూ క్రిమినల్ నేరాలు అని తెలిపారు. వీటికి భారీ జరిమానాలు ఉంటాయన్నారు. “సోషల్ మీడియా, వాట్సాప్, ఇమెయిల్ లేదా బ్లాగులు కూడా, ఇవన్నీ ఎలక్ట్రానిక్ మార్గాల పరిధిలోకి వస్తాయి. ఏదైనా షేర్ చేసిన తర్వాత, అది సైబర్ నేరంగా మారుతుంది. జరిమానాలు Dh500,000 వరకు, జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో పౌరులు కానివారిని దేశం నుంచి బహిష్కరిస్తారు.” అని హెచ్చరించారు బైరాన్ జేమ్స్.
ఎందుకు పోస్ట్ చేస్తారు?
బాధ లేదా నష్ట సమయంలో భావోద్వేగ నియంత్రణ కోల్పోతారని యూఏఈకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణుడు మనస్తత్వవేత్త రెహాబ్ అల్ హమ్మది అన్నారు. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి, తమ వైపు చెప్పడానికి ప్రయత్నిస్తారని.. కానీ సోషల్ మీడియా సురక్షితమైన మార్గం కాదని సూచించారు. ఇలాంటివి మరింత నష్టం చేస్తాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







