టూరిస్టులకు VAT రీఫండ్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!

- August 06, 2025 , by Maagulf
టూరిస్టులకు VAT రీఫండ్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!

జెద్దా: టూరిస్టులకు సంబంధించి VAT రీఫండ్ ను అందించే పథకాన్ని సౌదీ అరేబియా అధికారికంగా ప్రారంభించింది. సౌదీ వ్యాప్తంగా 1,442 రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా టూరిస్టులు అర్హత కలిగిన కొనుగోళ్లపై 15శాతం VAT ని తిరిగి పొందవచ్చని సౌదీ అరేబియా ప్రకటించింది.  ప్రపంచ టూరిజం హబ్ గా సౌదీ అరేబియాను నిలబెట్టేందుకు వ్యాట్ రీఫండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇది షాపింగ్ అనుభవాన్ని మరింత పెంచుతుందని తెలిపింది.

కాగా, 500 సౌదీ రియాల్స్ కంటే ఎక్కువగా కొనుగోళ్లు చేసిన వారికి మాత్రమే వ్యాట్ రీఫండ్ స్కీమ్ వర్తిస్తుంది. కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు వ్యాట్ ను తిరిగి పొందవచ్చు.  ఇక టూరిస్టులకు వ్యాట్ రీఫండ్ అందించడానికి రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 కేంద్రాలు, జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగు,  దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com