త్వరలో మళ్ళీ నడుస్తా: కమల్
- July 17, 2016
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ రెండు రోజుల క్రితం తన కార్యాలయం మెట్లు దిగుతుండగా కిందపడి గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో కమల్ కాలుకి సర్జరీ చేశారు. తాను త్వరలోనే కోలుకుని నడుస్తానని కమల్ అన్నారు. 'నేను నిలబడగలుగుతున్నాను, త్వరలోనే నడుస్తాను. నా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీరు నాపై చూపిన అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాల్లో తెలియడం లేదు' అనికమల్ చెప్పినట్లు సమాచారం. 'ఇది ప్రమాదం, బాధ కావచ్చు.. కానీ అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నాపై చూపించే ప్రేమకు మంత్రముగ్దుడ్ని అవుతున్నాను' అనే వాయిస్ మెసేజ్‌ను ప్రైవేటు ఆసుపత్రి నుంచి కమల్ పంపారు.
కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్రం తొలి షూటింగ్ షెడ్యూల్ లాస్ఏంజెల్స్లో ఇటీవల పూర్తైంది. ఈ చిత్రంలో కమల్ కుమార్తె శ్రుతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'దశావతారం'లో కమల్ నటించిన బలరాం నాయుడు పాత్రలో మళ్లీ ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. కమల్ చిన్న కుమార్తె అక్షరహాసన్ ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..







