బహ్రెయిన్ లో ‘ఇండియా 78: అన్ప్లగ్డ్’ క్విజ్..!!
- August 08, 2025
మనామాః భారత 78వ స్వతంత్ర దినాన్ని పురస్కరించుకుని ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 16 సాయంత్రం 4:30 నుండి 7:00 గంటల వరకు ఎపిక్స్ సినిమా, డానా మాల్లో ఇండియా 78: అన్ప్లగ్డ్ పేరుతో ప్రత్యేక క్విజ్ ప్రోగ్రామ్ ను నిర్వహించనున్నారు. ఇందులో స్కూల్స్, కార్పొరేట్ సంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు పాల్గొనవచ్చని ప్రకటించారు.
క్విజ్ లో భాగంగా భారతదేశ సంస్కృతి, చరిత్ర మరియు పొలిటికల్, విద్యా రంగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని ఇండియన్ లేడీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్మితా జెన్సన్ తెలిపారు.విజేతలుగా నిలిచిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ స్లాట్లు పరిమితంగానే ఉన్నాయని, అర్హులైన వారు వెంటనే అప్లై చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







